ఈ పార్కును మీ ఇంటి వద్ద చూడవచ్చు

ప్రకృతి మధ్య సమయం గడపడం ఒత్తిడికి దూరం చేసుకునేందుకు గొప్ప మార్గం అని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు మనం అటువంటి గొప్ప ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించలేకపోవచ్చు. ఆయా ప్రదేశాలు దూరంగా ఉండడం లేదా మన దగ్గర అంత సమయం లేకపోవడం వంటివి కూడా కారణాలు కావచ్చు. అలా మిస్ అయ్యే వారు ఇప్పుడు ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రదేశాలను మీరు మీ ఇంట్లో కూర్చుని కూడా చూడవచ్చు. అవును ఇది నిజం. అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ కధనం చదవాల్సిందే.



గ్రేట్ స్మోకీ మౌంటెన్స్ నేషనల్ పార్క్" ఒక అమెరికల్ జాతీయ ఉద్యానవనం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన ఈ పార్కు 5,22,419 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది తూర్పు యునైటెడ్ స్టేట్స్ లో అతిపెద్ద రక్షిణ ప్రాంతాలలో ఒకటి. అడవి పువ్వులు, జలపాతాలు, నల్ల ఎలుగుబంట్లకు పేరుగాంచిన ఈ ఉద్యానవనం మీరు నిశితంగా పరిశీలించాలంటే తప్పక చూడాలి. దీన్ని దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు చూడడానికి కొంత సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేయబడింది. అవును, మీరు లైవ్ వెబ్ క్యామ్ ల ద్వారా ఈ పార్కును సందర్శించవచ్చు.




యునైటెడ్ స్టేట్స్ లో తప్పక సందర్శించాల్సిన నేషనల్ పార్క్స్ లో 'గ్రేట్ స్మోకీ మౌంటెన్స్ నేషనల్ పార్క్' ఒకటి. ఇది టెనస్సీ మరియు నార్త్ కరోలినా యొక్క ఐదు ప్రావిన్సులను కలిగి ఉంది. ఈ జాతీయ ఉద్యానవనానికి ప్రవేశం ఉచితం. అమెరికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. రాత్రి పూట క్యాంపింగ్ చేయాలనుకునే వారికి చార్జి ఉంటుంది. ఈ పర్యాటక కేంద్రానికి ప్రతి సంవత్సరం దాదాపు 9 మిలియన్ల మంది సందర్శకులు వస్తారు.